Twitter | Search | |
Telangana CMO
Official account of CMO Telangana. Maintained by IT, E & C Dept, Telangana State.
4,677
Tweets
26
Following
616,945
Followers
Tweets
Telangana CMO Sep 19
Replying to @TelanganaCMO
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలతో సీఎం శ్రీ కేసీఆర్ గురువారం అసెంబ్లీ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి ఛాంబర్ లో సమావేశమయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. పూర్తి పాఠం:
Reply Retweet Like
Telangana CMO Sep 19
Replying to @TelanganaCMO
సాగునీరు, తాగునీరు, పోడు భూముల సమస్యను ప్రజలతో చర్చించి, శాశ్వతంగా పరిష్కరించేందుకు వచ్చే నెలలో 2 రోజుల పాటు ఉమ్మడి నిజామాబాద్ లో పర్యటించనున్నట్లు, అదే సందర్భంలో సాగునీటి కోసం, మంచినీటి కోసం శాశ్వత ప్రాతిపదికన చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతామని సీఎం వెల్లడించారు.
Reply Retweet Like
Telangana CMO Sep 19
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని అన్ని ప్రాంతాలకు సాగు తాగునీరు అందించే సమగ్ర ప్రణాళిక రూపొందించాలి. నిజాంసాగర్, సింగూరులో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున, ఆ ప్రాజెక్టుల పరిధిలోని గ్రామాలకు ఈ ఏడాది మంచినీరు అందించడానికి ప్రణాళిక రూపొందించాలి: సీఎం
Reply Retweet Like
Telangana CMO Sep 19
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ పై అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రకటన:
Reply Retweet Like
Telangana CMO Sep 18
నూతనంగా నియమితులైన తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) బోర్డు సభ్యులు శ్రీ డి. దామోదర్, శ్రీ భాస్కర్ రావు, శ్రీ ఎం. రాములు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసారు.
Reply Retweet Like
Telangana CMO Sep 18
Replying to @TelanganaCMO
అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లో సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు శ్రీ బాల్క సుమన్, శ్రీ గండ్ర వెంకట రమణారెడ్డి, శ్రీ దివాకర్ రావు శ్రీ వనమా వెంకటేశ్వర్లు, శ్రీ దుర్గం చిన్నయ్య, శ్రీ సండ్ర వెంకట వీరయ్య, శ్రీ రేగ కాంతారావు, శ్రీ కోరుకంటి చందర్, శ్రీమతి హరిప్రియ తదితరులతో సీఎం సమావేశమయ్యారు
Reply Retweet Like
Telangana CMO Sep 18
Replying to @TelanganaCMO
ప్రతీ ఏడాది మాదిరిగానే 2018-19 ఆర్థిక సంవత్సరంలో సింగరేణికి వచ్చిన లాభాల్లో కార్మికులకు వాటా ఇవ్వాలని ఎమ్మెల్యేలు కోరగా సీఎం సానుకూలంగా స్పందించారు. గురువారం అసెంబ్లీలో సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా చెల్లించే అంశాన్ని ప్రకటిస్తానని సీఎం హామీ ఇచ్చారు.
Reply Retweet Like
Telangana CMO Sep 18
సింగరేణి కార్మికులకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సింగరేణి ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలతో త్వరలోనే సమావేశమై అన్ని విషయాలు చర్చించి, పరిష్కార మార్గాలు సూచించాలని సింగరేణి సీఎండి శ్రీధర్ ను సీఎం శ్రీ కేసీఆర్ ఆదేశించారు.
Reply Retweet Like
Telangana CMO Sep 17
Replying to @TelanganaCMO
పూర్తి పాఠం:
Reply Retweet Like
Telangana CMO Sep 17
Replying to @TelanganaCMO
తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని ఉద్యమం నిర్వహించిన ఉద్యమ నాయకుడు, బాబ్లీ సర్పంచ్ శ్రీ బాబురావు గణపతిరావు కదమ్ నాయకత్వంలో నాందేడ్ జిల్లాకు చెందిన నయ్ గావ్, బోకర్, డెగ్లూర్, కిన్వట్, హథ్ గావ్ నియోజకవర్గాలకు చెందిన పలువురు నాయకులు అసెంబ్లీలో సీఎం శ్రీ కేసీఆర్ ను కలిశారు.
Reply Retweet Like
Telangana CMO Sep 17
Replying to @TelanganaCMO
ఇదే నినాదంతో త్వరలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని వారు నిర్ణయించారు. ఈ విషయాన్ని వారు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావుకు తెలిపి, తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు.
Reply Retweet Like
Telangana CMO Sep 17
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను తమ గ్రామాల్లోనూ అమలు చేయాలని, అలా చేయలేని పక్షంలో తమ గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వివిధ పార్టీల స్థానిక సంస్థల ప్రతినిధులు, ప్రజలు ఉద్యమ బాట పట్టారు.
Reply Retweet Like
Telangana CMO Sep 16
CM Sri K. Chandrashekar Rao extended birthday greetings to Hon'ble Prime Minister Shri ji. In a special message sent to the Prime Minister on Tuesday, CM prayed the Almighty to bless Modi ji to serve the country for many more years.
Reply Retweet Like
Telangana CMO Sep 16
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ శ్రీ కోడెల శివప్రసాద్ మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.
Reply Retweet Like
Telangana CMO Sep 15
లాంచీ ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని, హుటాహుటిన వెళ్లి అంత్యక్రియలు, ఇతరత్రా కార్యక్రమాలలోనూ పాల్గొనాలని సీఎం శ్రీ కేసీఆర్ మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేశ్ ను కోరారు.
Reply Retweet Like
Telangana CMO Sep 15
పాపికొండలు వద్ద జరిగిన లాంచీ ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు సీఎం శ్రీ కేసీఆర్ 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందిగా రవాణా శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ ను సీఎం ఆదేశించారు.
Reply Retweet Like
Telangana CMO Sep 15
తూర్పు గోదావరి జిల్లాలోని పాపికొండలు వద్ద లాంచీ ప్రమాదం జరగడం పట్ల సీఎం శ్రీ కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల్లో తెలంగాణ వాసులు ఉండటంతో అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Reply Retweet Like
Telangana CMO Sep 14
పరిశ్రమల శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ గా TRS పార్లమెంటరీ పార్టీ నేత డా. కె. కేశవరావు నియమితులయ్యారు. ఈ మేరకు లోక్ సభ సెక్రటరీ జనరల్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ విషయాన్ని సీఎం శ్రీ కేసీఆర్ కు కె. కేశవరావు అసెంబ్లీలో కలిసి చెప్పగా సీఎం ఆయనకు శాలువా కప్పి అభినందనలు తెలియజేశారు.
Reply Retweet Like
Telangana CMO Sep 13
Hon'ble Chief Minister Sri K. Chandrashekar Rao has conveyed his greetings on the occasion of Hindi Diwas to the people in Telangana State. CM conveyed his greetings to the admirers of Hindi language and literature around the world.
Reply Retweet Like
Telangana CMO Sep 13
CM also recalled the services rendered by Sri Yugandhar. CM has conveyed his heartfelt condolences to the members of the bereaved family especially Sri Yugandhar’s son and CEO Sri
Reply Retweet Like