Twitter | Search | |
Sakshi Telangana
6,305
Tweets
6
Following
8,045
Followers
Tweets
Sakshi Telangana Sep 8
కొత్త తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు: కేటీఆర్‌: ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమలు. హరీష్‌ రావు: ఆర్థిక శాఖ. సబితా ఇంద్రారెడ్డి: విద్యాశాఖ. గంగుల కమలాకర్‌: బీసీ సంక్షేమ, పౌరసరఫరాలు. సత్యవతి రాథోడ్‌: గిరిజనాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ. పువ్వాడ అజయ్‌ కుమార్‌: రవాణ శాఖ.
Reply Retweet Like
Sakshi Telangana Sep 8
తెలంగాణ తొలిమహిళా గవర్నర్‌గా సౌందర్‌రాజన్‌ ప్రమాణస్వీకారం చేసిన రోజునే..ఇద్దరు మహిళలకు మంత్రివర్గంలో చోటు కల్పించడం విశేషం. గత ప్రభుత్వంలో పద్మా దేవేందర్‌రెడ్డికి డిప్యూటీ స్పీకర్‌గా, గొంగిడి సునీతకు ప్రభుత్వ విప్‌గా అవకాశం లభించినా..తాజా మంత్రివర్గంలో వారికి ఎలాంటి అవకాశం రాలేదు
Reply Retweet Like
Sakshi Telangana Sep 8
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గంలో ఇద్దరు మహిళలకు చోటు దక్కింది. తెలంగాణ తొలి శాసనసభలో మహిళలకు మంత్రివర్గంలో చోటు లభించలేదు. తాజా మంత్రివర్గంలో సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లకు చోటు దక్కడంతో తొలి మహిళా మంత్రులుగా చరిత్ర సృష్టించారు.
Reply Retweet Like
Sakshi Telangana retweeted
Sakshi TV Sep 8
హైదరాబాద్‌: హరీష్ రావు (సిద్దిపేట) తోపాటు, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), గంగుల కమలాకర్‌ (కరీంనగర్‌), శాసనమండలి సభ్యురాలు సత్యవతి రాథోడ్‌, పువ్వాడ అజయ్‌ కుమార్‌ (ఖమ్మం)లు తెలంగాణ మంత్రులుగా ప్రమాణం చేశారు.
Reply Retweet Like
Sakshi Telangana Sep 8
వైభవంగా మంత్రుల ప్రమాణ స్వీకారం. హైదరాబాద్‌: తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలల అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొలిసారి మంత్రివర్గ విస్తరణ జరిపారు. ఈ మేరకు ఆదివారం కొత్తగా ఆరుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు.
Reply Retweet Like
Sakshi Telangana retweeted
Sakshi TV May 25
వైఎస్‌ జగన్‌ దంపతులకు కేసీఆర్‌ ఘన స్వాగతం. వైఎస్‌ జగన్‌ తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. జగన్‌కు కేసీఆర్‌తో పాటు తెలంగాణ మంత్రులు స్వాగతం పలికారు. సతీసమేతంగా వైఎస్‌ జగన్‌ ప్రగతి భవన్‌కు రాగా.. కేసీఆర్‌ పుష్పాగుచ్చాలిచ్చి.. జగన్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకుని అభినందించారు.
Reply Retweet Like
Sakshi Telangana May 19
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ పుంచుకున్నట్లు కనిపించినా తెలంగాణలో మాత్రం దారుణమైన ఫలితాలు చూవిచూసిందని ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టం చేశాయి. గత ఫలితాలనే పునారావృత్తం చేస్తూ.. కారు పార్టీ ఈసారి కూడా జోరు కొనసాగించింది.
Reply Retweet Like
Sakshi Telangana May 19
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో మెజార్టీ స్థానాలను సొంతం చేసుకుంటుందని పలు సర్వే సంస్థలు స్పష్టం చేశాయి. కాంగ్రెస్‌, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒక్కో స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనావేశాయి.
Reply Retweet Like
Sakshi Telangana May 19
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూసిన ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదలయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే ఫలితాలను రాబడుతుందని ఎగ్జిట్‌ పోల్స్‌ తేల్చిచెప్పాయి.
Reply Retweet Like
Sakshi Telangana retweeted
Sakshi TV May 9
మెరుగైన సమాజం కోసం.. దాడులు, దౌర్జన్యాలు. టీవీ9 ఆఫీసు ముందు 'సాక్షి' ప్రతినిధులపై రవిప్రకాష్‌ అనుచరుల దాడి. 'సాక్షి' ప్రతినిధులపై రవిప్రకాష్‌ అనుచరులు భౌతిక దాడులు చేసేందుకు యత్నం.
Reply Retweet Like
Sakshi Telangana retweeted
Sakshi TV May 9
టీవీ9 వద్ద ఉద్రిక్తత.. 'సాక్షి' ప్రతినిధిపై దౌర్జన్యం. సాక్షి ప్రతినిధిలతో రవిప్రకాష్‌ అనుచరుల వాగ్వాదం. కవరేజ్ చేస్తున్న సాక్షి మీడియాపై రవిప్రకాష్‌ అనుచరుల దౌర్జన్యం. 'సాక్షి' కెమెరాను లాక్కునేకు ప్రయత్నం. కేవలం 'సాక్షి' మీడియా ప్రతినిధిపైనే టార్గెట్‌.
Reply Retweet Like
Sakshi Telangana Apr 29
తెలంగాణ ఇంటర్‌ బోర్డును ప్రక్షాళన చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏబీవీపీ విద్యార్థులు ప్రగతిభవన్‌ ముట్టడికి ప్రయత్నించారు. ప్రగతిభవన్‌ ముందు పెద్దసంఖ్యలో ఏబీవీపీ విద్యార్థులు బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకొని.. బలవంతంగా అరెస్టు చేసి.. అక్కడి నుంచి తరలించారు.
Reply Retweet Like
Sakshi Telangana Apr 29
హైదరాబాద్‌: ఇంటర్‌ బోర్డు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన ప్రతిపక్ష పార్టీల నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేసి.. పోలీసు స్టేషన్లకు తరలించారు. కాంగ్రెస్‌ నేతలు వీ హనుమంతరావు, అంజన్‌కుమార్ యాదవ్‌ను అరెస్టు చేసి కాంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
Reply Retweet Like
Sakshi Telangana Apr 28
తెలంగాణ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ షెడ్యూల్‌ విడుదల. జూన్‌ 1తో పూర్తికానున్న థియరీ పరీక్షలు.. జూన్‌ 7 నుంచి 10 వరకు ప్రాక్టికల్స్‌. పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేసిన ఇంటర్మీడియెట్‌ బోర్డు.
Reply Retweet Like
Sakshi Telangana Apr 28
హైదరాబాద్‌: ఇంటర్ పరీక్షలు నిర్వహించిన ఏజెన్సీ తప్పిదాలపై ప్రభుత్వం స్పందించిన తీరును నిరసిస్తూ చేపట్టిన తమ పోరాటాన్ని జయప్రదం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి పార్టీ శ్రేణులను కోరారు.
Reply Retweet Like
Sakshi Telangana Apr 28
హైదరాబాద్‌: ఇంటర్ బోర్డ్ కార్యాలయం వద్ద అఖిలపక్షం ధర్నా నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అరెస్టులు చేపడుతుండటాన్ని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఖండించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, అరెస్టులు కాదు విద్యార్థులకు న్యాయం చేయాలని పొన్నం డిమాండ్‌ చేశారు.
Reply Retweet Like
Sakshi Telangana Apr 28
ఇంటర్ ఫలితాల్లో గందరగోళం, విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా హైదరాబాద్‌లో సీపీఎం ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలతో తెల్లవారుజామున 4 గంటలకే నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఇంటికి చేరుకున్న పోలీసులు.. ఆయనను హౌజ్‌ అరెస్టు చేసి నిర్బంధించారు.
Reply Retweet Like
Sakshi Telangana Apr 28
హైదరాబాద్‌: హైదరాబాద్‌లో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆ పార్టీ నాయకుడు అంజన్‌కుమార్‌ యాదవ్‌, టీజేఎస్‌ అధినేత కోదండరామ్‌ను పోలీసులు హౌజ్‌ అరెస్టు చేశారు. తమ పార్టీ నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తుండటాన్ని ఉత్తమ్‌, కోదండరామ్‌, చాడా వెంకట్‌రెడ్డి ఖండించారు.
Reply Retweet Like
Sakshi Telangana Apr 28
హైదరాబాద్‌: ఇంటర్ బోర్డ్ కార్యాలయం వద్ద అఖిలపక్షం ధర్నా నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌, సీపీఐ, తెలంగాణ జనసమితి పార్టీ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్‌ బోర్డు ముట్టడికి బయలుదేరిన నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు.
Reply Retweet Like
Sakshi Telangana Apr 28
హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటర్‌ మంటలు చల్లారడం లేదు. ఇంటర్‌ బోర్డు వైఫల్యాలపై ఆగ్రహంతో ఉన్న ప్రతిపక్షపార్టీలు తమ ఆందోళనను తీవ్రతరం చేశాయి. ఇంటర్ బోర్డు వైఫల్యాలు, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరిని నిరసిస్తూ బోర్డు కార్యాలయాన్ని ముట్టడికి అఖిలపక్షం ఆధ్వర్యంలో పార్టీలు పిలుపునిచ్చాయి
Reply Retweet Like